Breaking News

వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్.. రీజన్ ఇదే!

Published on Thu, 09/28/2023 - 10:42

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు.

2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి.

ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే..

ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)