Breaking News

ఎలక్ట్రిక్ వాహనాల హవా.. అమ్మకాల్లో టాటా టాప్ & మెర్సిడెస్ బెంజ్ లాస్ట్!

Published on Sat, 05/13/2023 - 21:40

2023 ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ అమ్మకాల్లో 'టాటా మోటార్స్' అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కంపెనీల జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' చివరి స్థానంలో నిలిచింది. గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

  • ఏప్రిల్ 2023లో టాటా మోటార్ మొత్తం 4,392 యూనిట్ల కార్లను విక్రయించి టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే నెల గత ఏడాది కంపెనీ అమ్మకాలు 1,817 కావడం గమనార్హం. 2022 కంటే 2023లో ఈ అమ్మకాలు ఏకంగా 141.72 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
  • మహీంద్రా కంపెనీ గత నెలలో 505 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2022 ఏప్రిల్ కంటే 3784.62 శాతం ఎక్కువ. అంటే 2022 ఏప్రిల్ నెలలో కంపెనీ మార్కెట్లో కేవలం 13 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
  • సౌత్ కొరియా బ్రాండ్ అయిన ఎంజి మోటార్ విషయానికి వస్తే, ఇది 2023 ఏప్రిల్ నెలలో 335 యూనిట్లను విక్రయించింది. 2022 ఏప్రిల్ నెలలో ఈ అమ్మకాలు 245 యూనిట్లు. అమ్మకాల పరంగా కంపెనీ మునుపటి ఏడాది కంటే 36.73% ఎక్కువ.

  • ఇక ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ గత నెలలో మార్కెట్లో మొత్తం 229 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో కారుని విడుదల చేయలేదు.
  • చైనా బ్రాండ్ అయిన BYD, జర్మన్ బ్రాండ్ అయిన BMW గత నెల అమ్మకాల్లో వరుసగా 154 యూనిట్లు, 60 యూనిట్లను విక్రయించాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు వరుసగా 21 యూనిట్లు, 17 యూనిట్లు. 2022 అమ్మకాల కంటే 2023లో అమ్మకాలు బాగా వృద్ధి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
  • 51 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ 7వ స్థానంలో నిలువగా, వోల్వో 8వ స్థానంలో నిలిచింది. వోల్వో కంపెనీ గత నెల అమ్మకాలు 34 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కియా కంపెనీ 34 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

  • ఇక చివరగా 10వ స్థానంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. 2023 ఏప్రిల్ నెల అమ్మకాలు 27 యూనిట్లు కాగా, 2022 ఏప్రిల్ నెలలో 11 యూనిట్లుగా నమోదయ్యాయి. అమ్మకాల్లో కంపెనీ 145.45 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాలు 5834 యూనిట్లు (2023 ఏప్రిల్). ఇదే నెల గత ఏడాది అమ్మకాలు 2252 యూనిట్లు మాత్రమే. అంటే అమ్మకాల వృద్ధి 100శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)