Breaking News

లైసెన్స్‌లు వెనక్కి ఇచ్చేసిన ఎన్‌బీఎఫ్‌సీలు

Published on Sat, 02/15/2025 - 09:54

రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ తమ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ (సీవోఆర్‌)లను స్వాధీనం చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.

ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్‌ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్‌బీఐ తనంతటగా 17 ఎన్‌బీఎఫ్‌సీల సీవోఆర్‌లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్‌ కార్యాలయం పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.

ఎన్‌బీఎఫ్‌సీ అంటే.. 
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ.  ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్‌లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది.  

ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులకు తేడా
ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు.   ఎన్‌బీఎఫ్‌సీలు చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్‌ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)