Breaking News

‘ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాం’.. ఉద్యోగులకు స్పాటిఫై భారీ షాక్‌!

Published on Mon, 12/04/2023 - 15:37

ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. తన వర్క్‌ ఫోర్స్‌లో మొత్తం 17శాతం మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది

స్పాటిఫై సీఈఓ డానియల్‌ ఏకే తన బ్లాగ్‌ పోస్ట్‌లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై స్పందించారు. ‘‘ సంస్థ పనితీరు బాగుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. డబ్బులు సంపాదించాలంటే బిజినెస్‌ జరగాలి. కాబట్టే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. డబ్బుల‍్ని ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి. ఎంత మందితో ఏ పనిని ఎలా చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లు’’ డానియల్‌ బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

ఉద్యోగుల తొలగింపులు తప్పడం లేదు
అంతేకాదు, ఈ నిర్ణయంతో స్పాటిఫై కంపెనీలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మా లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాల్ని మార్చేస్తున్నాం. తీసుకునే నిర్ణయం కఠినమైందే. కానీ తప్పడం లేదు. సంస్థలోని మొత్తం 17 శాతం ఉద్యోగుల్ని ఫైర్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 

ఫలితంగా స్పాటిఫైలో అనేక మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూటీగా చెప్పాలంటే కష్టపడి పనిచేసే తెలివైన, ప్రతిభావంతులైన సిబ్బంది మమ్మల్ని విడిచిపెడతారు అని డేనియల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

తొలగించిన ఉద్యోగుల్ని సంరక్షిస్తాం.
అదే సమయంలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. వారిని అన్ని విధాల ఆదుకుంటాం. ఉద్యోగి ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా పబ్లిక్‌ హాలిడేస్‌కి డబ్బులు చెల్లిస్తున్నాం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వినియోగించుకునే సదుపాయం, ఉద్యోగం పరంగా ఇమిగ్రేషన్‌ సమస్యలు రాకుండా కొత్త జాబ్‌లో జాయిన్‌ అయ్యే వరకు వారిని సంరక్షిస్తామని చెప్పారు. 

జూన్‌లో తొలగింపు 
స్పాటిఫై ఒకే ఏడాదిలో రెండో దఫా ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌లో పాడ్‌ కాస్ట్‌ యూనిట్‌లోని 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. పోడ్‌కాస్ట్ విభాగంలోని తొలగింపులు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని ఆ సమయంలో వెల్లడించింది. తాజాగా మరో మారు సిబ్బందికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు