Breaking News

కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!

Published on Fri, 11/01/2024 - 11:33

యూఎస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్‌వేర​్‌ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్‌ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్‌ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్‌ కంపెనీలో మేజర్‌ వాటాను కాగ్నిజెంట్‌ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్‌ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్‌ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు