Breaking News

వయసు పదకొండు, సంపాదన నెలకు కోటి.. ఎవరీ చిన్నారి?

Published on Sat, 02/25/2023 - 16:41

హెడ్‌లైన్ చదివిన వెంటనే మీకు అనుమానం రావొచ్చు, 11 ఏళ్ల వయసేంటి, కోటి సంపాదన ఏంటి అని. అయితే ఇది అక్షరాలా నిజం. ఆస్ట్రేలియాకు చెందిన 'పిక్సీ కర్టిస్' (Pixie Curtis) నెలకు కోటి రూపాయలకంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.

పిక్సీ కర్టిస్ తన తల్లి ఏర్పాటు చేసిన కంపెనీలో ఊహ తెలిసినప్పటి నుంచి పనిచేస్తోంది. ఈ కంపెనీలో చిన్నారి  పిక్సీ.. నెలకు 1,33,000 ఆస్ట్రేలియన్ డాలర్లు జీతం తీసుకుంటోంది. నెలకు భారీ మొత్తంగా శాలరీ తీసుకున్న వారి జాబితాలో పిక్సీ కూడా స్థానం సంపాదించింది. ఈ అమ్మాయి ఇప్పుడు మైనరే అయినా.. ఖరీదైన కారు వాడుతోంది.  సొంతంగా డ్రైవింగ్ రాకపోయినా రోజూ ఇంటికి, ఆఫీసుకి ఖరీదైన బెంజ్ కారులో తిరుగుతుంది.

పిక్సీ కర్టిస్ ఆఫీసులో పిల్లలకు సంబంధించిన హెయిర్ క్లిప్‌లు, రకరకాల హెడ్ బ్యాండ్స్ డిజైన్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది. పిక్సీ డిజైన్ చేసిన క్లిప్ లకు భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని పిక్సీ డిజైన్ చేస్తోన్న హెడ్ బ్యాండ్స్ అంటే చాలా మంది కొనేందుకు పోటీ పడతారు. ఇలాంటి వినూత్నమైన ప్రోడక్ట్స్ తయారీతో కంపెనీ పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది, అంతే కాకుండా కంపెనీలో జరిగే బోర్డు మీటింగులకు కూడా ఈ చిన్నారి హాజరవుతుంది.

ప్రస్తుతం చిన్నారి పిక్సీ కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ చదువు ముఖ్యం కాబట్టి, ఆమె తల్లి పిక్సీని కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి విరామం ఇవ్వమంటోంది. రోజూ ఆఫీసుకు వచ్చేకంటే కొన్నాళ్ల పాటు చదువుకోవాలని చెబుతోంది. ఇటీవల తన 10వ బర్త్‌డేని పిక్సీ.. దాదాపు 40,000 డాలర్ల ఖర్చుతో  చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే గిఫ్ట్‌గా తన తల్లి పిక్సీకి లగ్జరీ బెంజ్ కారు ఇచ్చింది. ఇదంతా చదివి పిల్ల కాదు పిడుగు అంటారా.. అది మీ ఇష్టం. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)