అది ‘100 శాతం’ ఫేక్‌ వ్యాపారమే!

Published on Thu, 10/29/2026 - 15:25

‘100 శాతం’.. అనేది తరుచుగా వ్యాపారాల్లో వినియోగించే పదం. తమ ఉత్పత్తుల్లో ‘100 శాతం’ అది ఉంది.. ఇది ఉంది.. అంటూ కస్టమర్లను ఆకర్షించేందుకు ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ప్రకటనల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ‘100 శాతం’ అనేది ‘100 శాతం’ అబద్ధం అని చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉంది.

ఉత్పత్తులపై ‘100 శాతం స్వచ్ఛత’, ‘100 శాతం సహజం’ అంటూ వినియోగదారులను ఆకర్షించే కంపెనీలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) షాక్‌ ఇస్తోంది. ప్రకటనల్లో చేసే వాదనలకు, ఉత్పత్తుల వాస్తవ కూర్పునకు పొంతన లేకపోవడంతో కంపెనీలపై జరిమానాలు విధిస్తోంది. తాజాగా సన్‌రైజ్‌ ఫుడ్స్‌ విక్రయించే ‘ఎవ్రీడే 100% హోల్‌ వీట్‌ బ్రెడ్‌’పై అభ్యంతరం వ్యక్తం చేసిన సీసీపీఏ.. రూ.లక్ష జరిమానా విధించి, ఆ ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఉత్పత్తిలో సంపూర్ణ గోధుమ పిండి 64 శాతమే ఉండగా, ‘100 శాతం’ అని ప్రకటించుకోవడం తప్పుదోవ పట్టించేదిగా పేర్కొంది. ‘హోల్‌ వీట్‌ బ్రెడ్‌’గా విక్రయించే ఉత్పత్తిలో పిండి ప్రాతిపదికన కనీసం 75 శాతం సంపూర్ణ గోధుమ పిండి ఉండాలన్న నిబంధనను కూడా ప్రస్తావించింది.

ఇది ఈ ఒక్క కంపెనీకే పరిమితం కాలేదు. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ‘100% హోల్‌ వీట్‌ బ్రెడ్‌’, ‘జీరో మైదా’ అంటూ చేసిన ప్రచారంపైనా సీసీపీఏ ఇటీవల చర్యలు తీసుకుంది. బ్రెడ్‌లో సంపూర్ణ గోధుమ పిండి వాటా 62 శాతమే ఉండటంతో రూ.లక్ష జరిమానా విధించింది. మరోవైపు, స్టోరియా ఫుడ్స్‌ ‘100% టెండర్‌ కొబ్బరి నీళ్లు’, ‘100% జ్యూస్‌’ వంటి వాదనలపైనా జూన్‌ 2026లో చర్యలు తీసుకుంది. కొబ్బరి నీళ్ల ఉత్పత్తిలో నీటితో పాటు కొబ్బరి నీళ్ల సారాన్ని కలిపి తయారుచేసిన విషయాన్ని చిన్న అక్షరాల్లో పేర్కొనడం, ‘100% సహజం’ వంటి వాదనలకు తగిన ఆధారాలు లేకపోవడం వంటి అంశాలను సీసీపీఏ తప్పుబట్టి రూ.లక్ష జరిమానా విధించింది.

ఆహార ఉత్పత్తుల లేబుళ్లు, ప్యాకేజింగ్‌, ప్రకటనల్లో ‘100%’ పదాన్ని ఉపయోగించడంపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కూడా 2025 మేలో సలహా జారీ చేసింది. ఉత్పత్తి కూర్పుపై వినియోగదారుల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్యాకెట్‌ ముందు భాగంలో పెద్ద అక్షరాలతో చేసే ప్రచారాన్ని వెనుకవైపు చిన్న అక్షరాల్లో ఇచ్చే వివరాలు సమర్థించలేవని సీసీపీఏ స్పష్టం చేస్తోంది. వినియోగదారులు ఆకర్షణీయమైన ప్రకటనలకే పరిమితం కాకుండా, పదార్థాల జాబితా, వాటి శాతాలు పరిశీలించి కొనుగోలు చేయడం అవసరం.

ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నీళ్లు.. ఏడ్చేసిన రిలయన్స్‌ అధినేత

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)