కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
Breaking News
ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
Published on Sat, 02/14/2026 - 08:39
ప్రేమకు భాషతో పనిలేదు అంటారు. అది వాస్తవమే అయినా భాషలకు అతీతంగా యువతీ యువకుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నా చెల్లల ప్రేమనా.. మార్కెట్‌తో కనెక్ట్ అవ్వాల్సిందే. నేటి కాలంలో ప్రేమకు ‘మార్కెట్’తో విడదీయలేని ముడిపడి ఉంది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగపూరితమైన రోజుగా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక భారీ కమర్షియల్ ఈవెంట్‌గా అవతరించింది. భారత్‌లో ఈ ఒక్క రోజున జరిగే వ్యాపారం విలువ సుమారు రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాల అంచనా.
విందులు.. వినోదాలు
వాలెంటైన్స్ డే ప్రభావం అత్యధికంగా కనిపించేది హోటళ్లు, రెస్టారెంట్లపైనే. క్యాండిల్ లైట్ డిన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కపుల్ మెనూ’లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఈ రోజు రెస్టారెంట్ల ఆదాయం 40-50% పెరుగుతుంది. నగరాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లు లవ్ ప్యాకేజీల పేరుతో బస, స్పా, డిన్నర్ కలిపి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
బహుమతుల్లో కొత్త పోకడలు
వస్తువుల క్రయవిక్రయాల్లో ఈ సీజన్‌లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. గులాబీ పూల ఎగుమతి, దిగుమతులు ఈ వారంలో పీక్ స్టేజ్‌లో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే కోట్లాది రూపాయల విలువైన గులాబీలు అమ్ముడవుతాయి. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్న బహుమతులు, కస్టమైజ్డ్ జువెలరీ, గాడ్జెట్స్‌కు యువత ప్రాధాన్యత ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించడం వల్ల ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధి నమోదు చేస్తుంది.
టూరిజం
ప్రేమికులు ఏకాంతంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంతో ట్రావెల్ ఇండస్ట్రీకి లాభాలొస్తాయి. దేశీయంగా గోవా, ఉదయ్‌పూర్, కేరళ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ నెల రోజుల ముందే బుక్ అవుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో భాగంగా మాల్దీవులు, థాయిలాండ్, బాలి వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి నేడు భారత్‌లో ఒక బలమైన వాణిజ్య శక్తిగా మారింది. వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వెరసి వాలెంటైన్స్ డేని ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మార్చేశాయి.
ఇదీ చదవండి: రాజ్‌పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే..
Tags : 1