ఈ రాశి వారికి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

Published on Sat, 03/08/2025 - 05:38

    గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.నవమి ప.12.02 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఆరుద్ర రా.2.45 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: ఉ.11.35 నుండి 1.11 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.16
నుండి 7.53 వరకు, అమృత ఘడియలు: సా.5.01 నుండి9.43 వరకు.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు.. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

వృషభం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

సింహం: అనుకున్న పనులలో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో పనిభారం.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో విజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు..

మకరం: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి.

కుంభం: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో  చికాకులు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)