ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Published on Tue, 02/17/2026 - 04:06

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: అమావాస్య సా.5.48 వరకు, తదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: ధనిష్ఠ  రా.9.52 వరకు, తదుపరి శతభిషం,వర్జ్యం: తె.5.08 నుండి 6.46 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: ఉ.11.01 నుండి 12.40 వరకు.

సూర్యోదయం : 6.30
సూర్యాస్తమయం : 5.57
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం.... ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామికవర్గాల యత్నాలలో ఆటంకాలు.

మిథునం.... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ఖర్చులు.

కర్కాటకం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం.... చర్చలు ఫలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పరిచయాలు పెరుగుతాయి.

కన్య.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తిలాభ సూచనలు. దేవాలయ దర్శనాలు.

తుల.. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. స్వల్ప ఆరోగ్యసమస్యలు.

వృశ్చికం.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. సంఘంలో ఆదరణ. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు.

ధనుస్సు.... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు. విద్యార్థులకు ఒత్తిడులు.

మకరం..... శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు శుభవార్తలు.

కుంభం..... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. కొన్ని అంచనాలలో పొరపాట్లు.

మీనం.... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు, విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)