ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాల్లో విజయం

Published on Tue, 07/14/2026 - 05:59

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,నిజ జ్యేష్ఠ మాసం, తిథి: అమావాస్య సా.4.07 వరకు, తదుపరి ఆషాఢ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: పునర్వసు రా.2.16 వరకు,  తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.3.03 నుండి 4.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.42 వరకు,అమృత ఘడియలు: రా.12.06 నుండి 1.30 వరకు.

సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  ఆభరణాలు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పురోభివృద్ధి.

వృషభం... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. సోదరులతో విభేదాలు.

మిథునం.... ఆర్థికాభివృద్ధి. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి.

కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో విరోధాలు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం.

సింహం...... నూతన ఉద్యోగయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు. ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

కన్య...పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల....దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.
వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం...రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.  అనారోగ్య సూచనలు. ఒప్పందాలు వాయిదా. సన్నిహితులతో విభేదాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

ధనుస్సు.. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సాపీగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం..... కొత్త ఉద్యోగయత్నాలు సఫలం. ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం.... కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. బంధువుల నుంచి విమర్శలు.
ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.

మీనం... వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాల్లో మార్పులు. ఆరోగ్యభంగం. రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)