Breaking News

ఈ రాశి వారికి విందువినోదాలు.. పనులు చకచకా అయిపోతాయ్..

Published on Mon, 01/23/2023 - 07:22

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.విదియ రా.10.40 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: శ్రవణం ఉ.6.16 వరకు, తదుపరి ధనిష్ఠ తె.4.45 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం: ఉ.10.00 నుండి 11.32 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.17వరకు, తదుపరి ప.2.46 నుండి 3.31 వరకు, అమృతఘడియలు: రా.7.02 నుండి 8.29 వరకు
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.46
రాహుకాలం: ఉ.7.30 నుండి 10.30 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కొందరికి పదవీయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

వృషభం: స్నేహితులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు కొంత నిరాశ. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సహాయం.

మిథునం: మిత్రులతో కలహాలు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మరింతగా బాధ్యతలు.

కర్కాటకం: బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సింహం:సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. ఒప్పందాలు చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. నిరుద్యోగులకు నిరుత్సాçహం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

తుల: బంధువులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

Videos

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)