ఈ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం

Published on Sun, 11/19/2023 - 06:22

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.షష్ఠి ఉ.7.47 వరకు, తదుపరి సప్తమి తె.5.34 (తెల్లవారితే సోమవారం), నక్షత్రం: శ్రవణం రా.11.52 వరకు, తదుపరి ధనిష్ట, వర్జ్యం: రా.3.37 నుండి 5.05 వరకు, దుర్ముహూర్తం: ప.3.54 నుండి 4.42 వరకు, అమృత ఘడియలు: ప.2.03 నుండి 3.34 వరకు; రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 5.21. 

మేషం: వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం.

వృషభం: కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు.

మిథునం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

సింహం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. వ్యవహార విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల పరిచయం.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి.  శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి.

మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటì  మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. వస్తులాభాలు.
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)