Breaking News

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది

Published on Sat, 11/04/2023 - 05:27

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు  ఉ.9.40 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.22 నుండి 8.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.33 వరకు, అమృతఘడియలు: ఉ.7.06 నుండి 8.48 వరకు, తిరిగి తె.4.47 నుండి 6.31 వరకు (తెల్లవారితే ఆదివారం); రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 5.26.

మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

వృషభం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

కర్కాటకం... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

కన్య... మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

వృశ్చికం.... పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

ధనుస్సు... రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

మకరం..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కుంభం... బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)