Breaking News

టీనేజ్ అకౌంట్‌' కు తాళం

Published on Mon, 12/16/2024 - 04:16

సామాజిక మాధ్యమంలో అకౌంట్‌ లేదని ఎవరైనా చెబితే వెంటనే.. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ..  నాకైతే రెండు మూడు ఖాతాలున్నాయి. ఒక్కో దాంట్లో లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు’ అంటూ గొప్పలు చెప్పుకునే వారు కోకొల్లలు. సోషల్‌ మీడియాను కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పరిచయాల వరకూ పరిమితమైతేనో, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటేనో పర్లేదు. కానీ.. అదుపు తప్పి అనర్థాలు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది జీవితాలు కేవలం సోషల్‌ మీడియా ప్రభావం వల్ల నాశనమవుతున్నాయి.

పిల్లలు, యుక్తవయసు వారు (టీనేజర్లు) సోషల్‌ మీడియాకు బానిసలుగా మారుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు దేశాలు కొన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించడంపై ఆంక్షలు పెడుతున్నాయి. మరోవైపు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్‌ వంటి సంస్థలు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.  – సాక్షి, అమరావతి

ఖాతా కోసం వయసు ఎక్కువని అబద్ధాలు
పిల్లలు, టీనేజర్స్, పెద్దలు అనే తేడా లేకుండా రోజుకి సగటున మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నారని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. సోషల్‌ మీడియా అకౌంట్‌ క్రియేట్‌ చేయాలంటే ఆ యూజర్‌కు 13 ఏళ్ల వయసు ఉండాలి. తప్పుడు సమాచారంతో ఈ–మెయిల్‌ ఐడీలు తయారు చేసుకుని, 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఖాతాలు తెరుస్తున్నారు.

8 నుంచి 17 సంవత్సరాల వయసు వారిలో 22% మంది సోషల్‌ మీడియా యాప్‌లలో తమకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్టు అబద్ధం చెబుతున్నారని అమెరికా సంస్థ ‘ఆఫ్‌కామ్‌’ అధ్యయనంలో తేలింది. 15 నుంచి 18 ఏళ్ల వయసులో శారీరక, మానసిక మార్పులు  జరుగుతాయి. అటువంటి సమయంలో సోషల్‌ మీడియాకు అలవాటు పడితే వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, రకరకాల వింత, వికృత ప్రవర్తనలను నేర్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రానున్న 2025 సంవత్సరంలో ‘ఆన్‌లైన్‌ భద్రతలో నిజమైన మార్పు’ రావాలని టెక్‌ నిపుణులు సోషల్‌ మీడియా సంస్థలను కోరుతున్నారు.

వారి ఖాతాలకు ఆటోమేటిక్‌ ప్రైవసీ 
సోషల్‌ మీడియా వేదికల్ని నిర్వహిస్తున్న సంస్థలు ఇటీవల ఖాతాదారుల భద్రతపై దృష్టి సారించాయి. అనేక సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. యువతకు సోషల్‌ మీడియాను సురక్షితమైనదిగా ఉంచడానికి ఇన్‌స్ర్ట్రాగామ్‌ ‘టీన్‌ అకౌంట్‌’లను తీసుకువచి్చంది. అలాగే రోజూ వేల సంఖ్యలో వయసు తప్పుగా నమోదు చేసిన వారి ఖాతాలను కొన్ని సంస్థలు తొలగిస్తున్నాయి. అలాగే టీనేజర్ల ఖాతాలకు ఆటోమేటిక్‌గా లాక్‌ (ప్రైవసీ) వేసేస్తున్నాయి.

అంటే వారి ఖాతాను వారు అనుమతించిన స్నేహితులు మాత్రమే చూడగలరు. ఇతరులకు వారి వివరాలు కనిపించవు. మెషిన్‌ లెరి్నంగ్‌ టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. ఆన్‌లైన్‌ సేఫ్టీ యాక్ట్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్ట్రే­లియా ఓ అడుగు ముందుకు వేసి, 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధించింది.

మార్చాల్సింది తల్లిదండ్రులే 
సోషల్‌ మీడియాలో సన్నిహితులతో, అపరిచిత  వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అది సైబర్‌ కేటుగాళ్లు దొంగిలించి, వాటిద్వారా బెదిరిస్తూ.. డబ్బులు గుంజుతారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అందుకే పదేళ్లు నుంచి 20 ఏళ్లలోపు వయసు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చే­యాలి. ఇంటి పనుల్లోనూ భాగం చేయాలి. తల్లిందండ్రులు పిల్లలతో ముచ్చటిస్తుండాలి. ప్రతి చిన్న ఘటనను ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం మాన్పించాలి. చ­దు­వుపై దృష్టి కేంద్రీకరించేలా అలవాటు చేయాలి. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)