Breaking News

బాలకృష్ణ ఆదేశాలతోనే టీడీపీ గూండాల దాడి!

Published on Tue, 11/18/2025 - 05:32

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అనుసరి­స్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు పాలనా వైఫల్యాలతో ఈ ప్రభుత్వం అతి త్వరలోనే కుప్పకూలడం ఖాయమని మాజీ ఎమ్మె­ల్యే, ఉరవకొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి అత్యంత హేయమని మండిపడ్డారు. దాడిని నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని, పైగా తమ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించారని ఆక్షేపించారు. హిందూపురం బయలుదేరిన తమ పార్టీ నాయకులను ఆదివారం ఎక్కడికక్కడ అడ్డుకోవటాన్ని ఖండించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

దాడి వెనుక బాలకృష్ణ ప్రోద్బలం 
‘ప్రశాంతత కోరుకునే హిందూపురంలో జరిగిన ఘటన చూసి ప్రజలు టీడీపీని, ఎమ్మెల్యే బాలకృష్ణను అసహ్యించుకుంటున్నారు. రాజకీయ విమ­ర్శ చేసినందుకు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం హేయం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సహించరానివి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అడుగు పెట్టిన రోజే ఈ ఘటన జరగటాన్ని బట్టి దాడి వెనుక ఆయన ప్రోద్బ­లం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాలకృష్ణ ఆదేశాలతోనే టీడీపీ గూండాలు దాడి చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 

బాధితులపైనే అక్రమ కేసులా? 
దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోగా, అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం సిగ్గుచేటు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. హిందూపురం వెళ్తున్న అనంతపురం, సత్యసాయి జిల్లాల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను అడ్డుకుని వెనక్కి పంపారు. మాజీ ఎమ్మెల్యేలను హౌస్‌ అరెస్టులు చేశారంటే వైఎస్సార్‌ సీపీని చూసి ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో తెలుస్తోంది. 

సతీష్‌ మృతిపై తప్పుడు ప్రచారం 
‘టీటీడీ పూర్వ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, చివరకు పోస్టుమార్టం నిర్వహించకముందే వైఎస్సార్‌సీపీని నిందిస్తూ ఎల్లో మీడియా, టీడీపీ అనుకూల సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీపై నిందలు మోపి రాజకీయంగా బురద జల్లడమే లక్ష్యంగా హత్య అంటూ కట్టుకథ ప్రచారం చేశారు’ అని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)