Breaking News

YSRCP Bus Yatra: ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర మొదలు.. షెడ్యూల్‌ ఇదే..

Published on Fri, 10/13/2023 - 16:11

సాక్షి, విజయనగరం: రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్‌సీపీయే. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘ నిన్నటి సభలో సీఎం జగన్‌ వాస్తవాలే మాట్లాడారు. వ్యక్తి గత దూషణలు చేయలేదు. లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తి గతం కాదు’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్‌
26- ఇచ్చాపురం
27-గజపతినగరం
28-భీమిలి
30-పాడేరు
31-ఆముదాలవలస
నవంబర్ 1-పార్వతీపురం
నవంబర్ 2 -మాడుగుల
నవంబర్ 3 -నరసన్నపేట
నవంబర్ 4 -ఎస్.కోట
నవంబర్ 6 -గాజువాక
నవంబర్ 7 -రాజాం
నవంబర్ 8 -సాలూరు
నవంబర్ 9 -అనకాపల్లి
చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు