మద్దతు ధరను ఎత్తేసినవాళ్లు పరిహారం చెల్లిస్తారా?

Published on Tue, 09/23/2025 - 06:13

కోడుమూరు రూరల్‌: ‘‘క్వింటా ఉల్లికి ప్రకటించిన రూ.1,200 మద్దతు ధరను ఎత్తివేసి హెక్టార్‌ ఉల్లికి రూ.50 వేల నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించడం పెద్ద బూటకం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి ఘోరంగా మారింది. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’’ అని  వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘కుడా’ మాజీ చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కోడుమూరు సమన్వయకర్త డాక్టర్‌ ఆదిమూలపు సతీ‹Ùతో కలిసి కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ఉల్లి పంటను ఆయన పరిశీలించారు.

ఉల్లి సాగు పెట్టుబడులు, మార్కెట్‌ పరిస్థితి, ప్రభుత్వం కలి్పస్తున్న మద్దతు ధర తదితరాలపై రైతులతో మాట్లాడారు. రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేయడంతో ప్రభుత్వం కదిలింది. కానీ, కంటితుడుపుగా క్వింటా ఉల్లికి రూ.1,200 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. ఈ ధరతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వారు ఉల్లి పంటను పశువుల మేతగా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితులను ఏనాడూ చూడలేదు. రైతులకు మద్దతు ధరతో పాటు నష్టపరిహారం కూడా అందించాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ఉల్లి రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆదిమూలపు సతీ‹Ù, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ‘‘రైతులకు కనీసం ఒక యూరియా బస్తాను కూడా సవ్యంగా అందించలేకపోతోంది. ఉల్లి కొనుగోళ్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడం దారుణం. ఇలాగే వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)