Breaking News

‘మా భర్తలకు ఏం జరిగినా ఎస్పీ, పోలీసులదే బాధ్యత’

Published on Sat, 07/12/2025 - 09:37

సాక్షి, చిత్తూరు: ఏపీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం మార్కెడ్‌ యార్డ్‌ పర్యటనపై కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చి.. ఫొటోగ్రాఫర్‌పై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ శివపై దాడి కేసులో అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్‌లను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, చిత్తూరు డీటీసీకి తరలించారు. అయితే, వారిని మాత్రం పోలీసులు చూపించడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సందర్భంగా మోహన్ భార్య రాసాత్తి మాట్లాడుతూ..‘నా భర్త ఆరోగ్యం సరిగా లేదు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. రోజుకు మూడు సార్లు మందులు వేసుకోవాలి.. మూడు రోజులుగా పోలీసులు నిర్బంధంలో ఉన్నాడు.. నా భర్త మోహన్‌కు ఏం జరిగినా పోలీసులు, జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలి. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం.. నా భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు’ అని అన్నారు.

చక్రి భార్య కవిత మాట్లాడుతూ..‘ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయక పోయినా నా భర్తను అరెస్ట్ చేశారు. బాధితుడు ఫొటోగ్రాఫర్ శివ కూడా చక్రి నా కెమెరా కాపాడాడు.. నన్ను రక్షించాడు అని చెప్తున్నా నా భర్తపై తప్పుడు కేసు పెడుతున్నారు’ అని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)