Breaking News

రాజ్యాంగంపై చర్చ.. వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కీలక ప్రసంగం

Published on Mon, 12/16/2024 - 18:07

సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్‌16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. 

ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో  తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే. 

దేశంలో ఆర్థిక  అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్  నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్‌కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన  ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)