Breaking News

‘సూపర్‌సిక్స్‌’ అమలు ఎప్పుడు?: లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి

Published on Mon, 07/29/2024 - 15:47

సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..

ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా  హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. 

అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్‌గా కావాలి..

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్‌లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 

ఏపీకి అప్పులు కాదు... అభయం ఇవ్వండి

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)