Breaking News

ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు

Published on Mon, 08/25/2025 - 21:33

తాడేపల్లి : అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎస్టీ, ఎస్సీ కమిషన్లకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్‌ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది  మోహన్‌కుమార్‌లపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘బాధితులు ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారు. వారందరినీ ఎమ్మెల్యే బుడ్డా కులదూషణ చేశారు. వారిపై దారుణంగా దాడి చేశారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించి రాత్రంతా తిప్పారు ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డానే స్వయంగా కారు నడిపారు. అనంతరం వారిని ఒక గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. 

అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడమే. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 1989 కింద నేరం. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల గౌరవంపై తీవ్రమైన దాడి చేసినట్టే. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బుడ్డా పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)