Breaking News

‘కరువు సాయం లేదు...క్రాప్ ఇన్స్యూరెన్స్ లేదు.. ఇప్పుడేమో ఇలా’

Published on Tue, 03/11/2025 - 16:40

అమరావతి: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రూ. 20 వేలు ఇవ్వకుండా ఇప్పుడు మాట మార్చడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా తప్పుబట్టారు.  రైతులకు పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపే అనడం కచ్చితంగా రైతును మోసం చేయడమేని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.

ఈ రోజు(మంగళవారం) శాసనమండలిలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కల్గించాయి. పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు అంటున్నారు. మండలి సాక్షిగా రైతుకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. అన్నమో రామచంద్రా అనే పరిస్థితిని రైతుకు తీసుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది.

కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ప్రభుత్వం పాలనలో నాణ్యమైన విత్తనాలు అందించారు. కూటమి పాలనలో నాణ్యమైన విత్తనాలే దొరకలేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. కరువు సాయం లేదు.. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మిర్చికి గతంలో రూ. 21 వేలకు పైగా మద్దతు ధర ఉంది.  వైఎస్ జగన్ మిర్చి యార్డ్ ను సందర్శించే వరకూ ఈ ప్రభుత్వంలో కదిలిక రాలేదు. కూటమి ప్రభుత్వం చేసే సమీక్షలు రైతుకి మేలు చేయడానికా?.. కాలక్షేపానికా?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి.  రూ. 8కి టమోటా కొంటామని చెప్పారు.. ఇప్పటివరకూ ఒక్క కిలో టమోటా అయినా ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అని నిలదీశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)