Breaking News

ఆశలు కల్పించి.. పాతాళానికి నెట్టేశారు

Published on Fri, 11/15/2024 - 05:19

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఆకాశమంత ఎత్తున ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను పాతా­ళానికి తోసేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మండిపడ్డారు. బడ్జెట్‌పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పాల్గొన్న రవి­బాబు మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ అని ప్రజలను మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయ­మంటే సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 76 స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా పెట్టలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం మార్చి­వేసిందన్నారు. 

ఎన్నికల ముందు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అంటే... రూ.11లక్షల కోట్లు అప్పు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చా­క గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పించారని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.6.46లక్షల కోట్లు అని తేల్చారని, చంద్రబాబు నిజాయతీ ఇదేనా? అని నిలదీశారు. 

వైఎస్‌ జగన్‌మోహ­­­న్‌­రెడ్డి హయాంలో నాడు–నేడు ద్వారా రూ.32­వేల కోట్లతో ప్రభు­త్వ పాఠశా­ల­లను తీర్చిదిద్దా­రని, రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ కార్య­­క్రమాలను అమలు చేసి ఆదు­­కున్నారని గుర్తుచేశారు.  ఇప్పుడు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, 2014 నుంచి 2019 వరకు  ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకుని మెగా డీఎస్సీ ఇస్తున్నామని, రిలయన్స్, టీసీఎస్‌ వంటి సంస్థలను తెస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 

సభ్యులు మాట్లాడుతుండగా మధ్యలో మంత్రులు అడ్డుతగలడం సరికాదని, అన్ని వివరాలు నోట్‌ చేసుకుని చివరిలో సమాధానం ఇవ్వాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హితవుపలికారు. అనంతర రవిబాబు ప్రసంగం కొనసాగిస్తూ ఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్‌లో చూపించిన దానికి పొంతన లేదని తప్పుబట్టారు. అనంతరం టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)