Breaking News

హామీల అమలెప్పుడు?

Published on Thu, 11/14/2024 - 04:55

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్‌ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సా­ర్‌సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు.

ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడు­తూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్‌లో మొదటిలోనే మొదలుపెట్టారని,  ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. 

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్‌ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్‌ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)