‘డయేరియా బాధితులకు సరైన వైద్య చికిత్స అందించడం లేదు’

Published on Sat, 09/13/2025 - 19:06

విజయవాడ  నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్‌ 13వ తేదీ) న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితుల వైద్య శిబిరాన్ని మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ శైలజ రెడ్డి, కార్పోరేటర్‌ దేవిలు పరామర్శించారు. 

అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ..  ‘న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఇంకా వందమందికి పైగా జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు. డయేరియా ప్రబలి నాలుగు రోజులు అయినా ప్రభుత్వంలో సరైన స్పందన లేదు. అధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోంది. డయేరియా బాధితులకు సరైన వైద్య చికిత్స కూడా అందించడం లేదు. మంత్రులు మొక్కుబడిగా డయేరియా బాధితులను చూసేందుకు వస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి డయేరియా విషయంలో మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం. 

డయేరియాతో కళ్ళు ఎదుటీ ఒక వ్యక్తి చనిపోతే అది డయేరియా మృతి కాదని కప్పిపుచ్చే చర్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తోంది. డయేరియా కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. డయేరియా పరబలి నాలుగు రోజులైనా నేటికీ రిపోర్టు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంచినీటి కాలుష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ప్రజలంతా చెపుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరు విత్తనట్టు వ్యవహరిస్తున్నారు. 

ఇంటింటికి మంచి నీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి. ట్యాపుల ద్వారా రక్షిత మంచినీరు శుభ్రంగా ఉందా లేదా పరిశీలన చేసిన తర్వాతే వదలాలి. జరిగిన ఘటనపై క్షేత్రస్థాయి విచారణ చేసేందుకు వైఎస్ఆర్సిపి వైద్యుల బృందం ఆదివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించనుంది. డయేరియాతో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని మునిసిపల్ మంత్రి కనీసం పరామర్శించకపోవడం, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం దారుణం’ అని ధ్వజమెత్తారు.

మేయర్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ డయేరియా ఘటన జరగి నాలుగు రోజులు అయినా దేని కారణంగా డయేరియా వచ్చిందో ప్రభుత్వం తేల్చలేక పోతోంది. లేదంటే రిపోర్టులు వచ్చినా ప్రభుత్వం కావాలనే దాచి పెడుతుందా? అర్థం కావడం లేదు. డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని మండిపడ్డారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)