Breaking News

'సర్‌' ప్రక్రియలో లోపాలపై ఎన్నికల CEOకి వైఎస్సార్‌సీపీ లేఖ

Published on Thu, 07/02/2026 - 23:32

సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల CEOకి లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 (Special Intensive Revision) ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా విశ్వసనీయత దెబ్బతినకుండా మరో నెల గడువు ఇవ్వాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్యుమనరేషన్ ఫారాలు ఇవ్వకుండానే పంపిణీ చేసినట్లు తప్పుడు నమోదు జరుగుతోందని ఆయన ఆరోపించారు.  

బీఎల్వోల పంపిణీపై ర్యాండమ్ వెరిఫికేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30 శాతం ఫారాలకే డిజిటలైజేషన్ పూర్తయింది. అనేక నియోజకవర్గాల్లో అది 20 శాతం కూడా దాటలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పూర్తయ్యే వరకు సర్‌ తదుపరి దశలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

గిరిజన, అటవీ, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని సూచిస్తూ, ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని CEOను కోరారు. ఈ లేఖలో అప్పిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)