Breaking News

‘దాడికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నాం’

Published on Thu, 02/26/2026 - 15:31

విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. మండిపడ్డారు. అంబటి అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు.. హైకోర్టు డైరెక్షన్స్‌ పాటించలేదంటూ ధ్వజమెత్తారు.

మూడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లలో ప్రొసీజర్‌ ఫాలో కాలేదని విమర్శించారు.  అసలు దాడికి పాల్పడిన వారికి స్టేషన్‌బెయిల్‌ ఎలా ఇస్తారని పొన్నవోలు ప్రశ్నించారు. దాడికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామన్నారు. అంబటి ఇంటిపై దాడి వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు పొన్నవోలు.

కాగా, గత నెల 31వ తేదీ ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. టీడీపీ మూకలు.. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు..  ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు.  అంబటి ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్‌, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.

తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరి వెళ్లిన సమయంలో గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. 

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు అంబటి . దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్‌ హల్‌చల్‌ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై దాడికి యత్నించే సమయంలో పోలీసులు చోద్యం చూశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇదిలా ఉంచితే, అంబటి రాంబాబును అరెస్ట్‌కు ముందే రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రాత్రి ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. అంబటిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఉద్రిక్తతల నడుమే అంబటిని అరెస్ట్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)