Breaking News

‘కేక్‌ కట్‌ చేసుకున్నా.. కోడిని కోసుకున్నా కేసులు’

Published on Fri, 01/09/2026 - 13:45

తాడేపల్లి : ఏపీలో పోలీసుల వైఖరి వింతగా ఉందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి విమర్శించారు. కేక్‌ కట్‌ చేసినా, కోడిని కోసుకున్నా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 9వ  తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. చివరికి జగన్‌ ఫ్లెక్సీలను చూసినా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

‘ఇది రెడ్‌ బుక్‌ పాలనకు నిదర్శనంగా ఉంది. జగన్ పుట్టినరోజున కోడిని కోశారని తిరుపతిలో కేసు పెట్టి అపహాస్యానికి గురయ్యారు.  నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. వారిని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు సైతం దిగ్భ్రాంతికి గురైంది. కేక్ ను కత్తితో కట్ చేశారని ఇంకో కేసు కూడా పెట్టారు. అసలు రాష్ట్రంలో పోలీసుల వైఖరి దారుణంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కోళ్ల పందేలు చట్టరిత్యా నేరం.మరి సంక్రాంతి సందర్భంగా జరిగే కోళ్ల పందేలపై పోలీసులు ఏం చేయబోతున్నారు?. 

కనుమ రోజు అందరూ నాన్ వెజ్ తింటారు అప్పుడు కూడా జనం మీద కేసులు పెడతారా?, జగన్ ఫ్లెక్సీలను జనం చూస్తే వారి మీద కూడా కేసులు పెట్టేలా ఉన్నారు, నిందితులకు ముసుగులు వేయకూడదు, కొట్టకూడదు, రోడ్లమీద ఊరేగించ కూడదు, చేతులకు సంకెళ్లు వేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పాయి. చట్టప్రకారం పని చేయకపోతే తర్వాత పోలీసులే ఇబ్బంది పడతారు. అధికరం శాశ్వతం కాదు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి’ అని హెచ్చరించారు.

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)