సీఎం జగన్‌కు నేతల సంఘీభావం

Published on Tue, 04/16/2024 - 05:28

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో సోమవారం కేసరపల్లి క్యాంపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎ­త్తున తరలి­వచ్చి ముఖ్యమంత్రికి సంఘీభా­వం తెలి­పారు. హత్యా­యత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసి, సీఎం యోగక్షేమాలు అడిగి తెలు­సుకు­న్నారు. వైఎస్సార్‌­సీపీ తిరిగి అధికారంలోకి రావ­టం ఖాయ­మని, బస్సుయా­త్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని పార్టీ నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదంవల్లే అదృష్ట­వశాత్తూ దాడి నుంచి సీఎం తప్పించుకున్నా­రన్నారు.

ఇలాంటి దాడులు యాత్రను, వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేవని ముఖ్యమంత్రి జగన్‌ నేతలతో అన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నా­యని ఆయన వారితో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకువేద్దామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు.

ఇక సీఎంను కలిసిన వారిలో మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు కేశినేని నాని, అయోథ్యరామిరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్‌రావు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కైలే అనిల్‌కుమార్, వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, కల్పల­తారెడ్డి, విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, పెడన అభ్యర్థి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)