Breaking News

‘బాబు ఇదేం పద్దతి.. అమ్మకానికి అంబేద్కర్‌ విగ్రహం’

Published on Mon, 04/14/2025 - 11:37

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్‌ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, పలువురు దళిత నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతారా?. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు బుద్ది వచ్చేలా చేయాలి. అంబేద్కర్ వలనే మన రాజ్యాంగానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. అలాంటి అంబేద్కర్ ని అమ్మకానికి పెడతారా?. భారత దేశానికి రాజ్యాంగం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌.

దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి జరుపుకుంటున్నారు. ఆలోచన విధానంలో పరిపాలన చేసిన నేత వైఎస్‌ జగన్‌. విద్యా, వైద్యంలో అంబేద్కర్‌ ఆలోచనలను వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చి.. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వైద్యానికి ఎక్కడా లోటు లేకుండా చేశారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం నిర్మించి జాతికి అందించిన వ్యక్తి జగన్. అంబేద్కర్‌ ఆలోచన విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. చంద్రబాబు దళిత వ్యతిరేకిగా పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు చేసే మోసం, అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారు.

తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌ కుమార్‌ కామెంట్స్‌.. 
అంబేద్కర్‌ గారి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్‌ గారు, ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పుట్టినరోజు చేసేది జీసస్‌ క్రీస్తు, అంబేద్కర్‌ గారివి మాత్రమే, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఇలా బడుగు బలహీనవర్గాల వారంతా ఒక మెట్టు పైన ఉండాలని ఆలోచించింది అంబేద్కర్‌ గారు ఆ తర్వాత మా నాయకుడు జగన్‌ గారు మాత్రమే, అంబేద్కర్‌ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌..
అంబేద్కర్‌ గారి ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్ళుగా జగన్‌ గారి పాలన చూశాం, ఎక్కడా రాజ్యంగ ఉల్లంఘన జరగకుండా పాలించారు, కానీ కూటమి పాలనలో అంబేద్కర్‌ గారి ఆశయాలకు తూట్లుపొడిచి దళితులు, మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలను ఊచకోత కోస్తూ పాలిస్తున్నారు. ఇలాంటి పాలన అవసరంలేదని మనమంతా ఆలోచించి రానున్న రోజుల్లో అంబేద్కర్‌ గారి స్ఫూర్తిని కొనసాగించే జగన్‌ గారిని సీఎం పీఠంపై మరోసారి కూర్చోపెట్టేందుకు మనమంతా కష్టపడాలని కోరుకుంటున్నాను. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)