Breaking News

‘కూటమి నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారు’

Published on Sat, 07/18/2026 - 11:27

సాక్షి, యలమంచిలి: కూటమి పాలనలో దోపిడీకి హద్దు లేకుండాపోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాల్లో పంచ భూతాలను ఎంపీ సీఎం రమేష్ దోచుకుంటున్నారని అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు అంటూ మండిపడ్డారు.

అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలిలో పంచదారల కొండపై అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. వారి రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రిలే నిరాహార దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘ఎంపీ సీఎం రమేష్‌ దోపీడీ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. కొండలను పిండి చేస్తున్నారు. వందల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. పవిత్రమైన పంచదార్ల కొండను మింగేస్తున్నారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమైపోయారు?. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన పంచదార కొండను ధ్వంసం చేస్తున్నారు. ఈ పాపానికి పవన్ కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?’ అని ప్రశ్నించారు.

కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్లు దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నారు. కొండలను మాయం చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నారు. కడప నుంచి సీఎం రమేష్ ప్రజా సేవకు వచ్చారు అనుకున్నాం. వారి కంపెనీల పేరు మీద పర్మిట్లతో కొండలను మింగేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు తెల్లవారితే ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయానికి గుండు కొడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని  వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తాం. ఈ నెల 21వ తేదీన చలో పంచదార్ల కార్యక్రమం నిర్వహిస్తాం. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. మైనింగ్ లీజులు సోమవారం లోపు రద్దు చేయాలి అని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి దాడి శెట్టి రాజా మాట్లాడుతూ..‘మహా పవిత్రమైనవి పంచదార్ల కొండలు. ఈ కొండ గురించి మహా భారతంలో ప్రస్తావన ఉంది. చోళుల కాలంలో ఉమా ధర్మ లింగేశ్వర స్వామి  దేవాలయాన్ని నిర్మించారు. పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ సనాతన వాదులకు కనిపించలేదా?. సంపద సృష్టి పేరుతో వారసత్వ సంపదను దోచుకుంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్ర సంపాదనను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.

కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘పంచదార్ల కొండపై కూటమి అనకొండలు పడ్డాయి. కొండలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ గద్దల్లా దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 30 కిలో మీటర్ల పరిధిలో పంచదార్ల కొండలు విస్తరించి ఉన్నాయి. ప్రజలకు జీవనాధారం ఈ కొండలు’ అని చెప్పుకొచ్చారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)