Breaking News

వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్ట్‌..స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

Published on Tue, 07/01/2025 - 04:24

అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమో­దు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మహారాణిపేట పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి, ష్యూరిటీలు సమరి్పంచి, స్టేషన్‌ బెయిల్‌పై వచ్చారు.  

నిరసన తెలిపినా తప్పేనా?  
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అందించకుండా మోసగించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయనందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్‌ 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ‘యువత పోరు‘పేరిట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.

పోలీసులు జారీ చేసిన నోటీసులను గౌరవించి స్టేషన్‌కు స్వయంగా వచ్చి ష్యూరిటీలు సమర్పించామన్నారు. కూటమి ప్రభుత్వ  తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేకే రాజు వెంట డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీశ్‌ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, ఫ్లోర్‌ లీడర్‌ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పి.వి.సురేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)