Breaking News

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..

Published on Mon, 02/03/2025 - 04:22

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేషన్లు(corporations ), మున్సిపాలిటీల(municipalities) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య­ర్థులను చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం బెదిరి­స్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జ­న్యకాండను అడ్డుకుని.. రాష్ట్రంలో ప్రజా­స్వా­మ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమి­షనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని వైఎస్సార్‌­సీపీ మాజీ మంత్రు­లు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అవినాశ్, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు కలిసి వినతి పత్రం అందజేశారు. 

బెదిరించి లాక్కోవడం దుర్మార్గం
మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లా­డుతూ తిరుపతి డిప్యూటీ మేయర్‌ పదవికి వైఎస్సార్‌సీపీ తరఫున శేఖర్‌­రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆయన ఆస్తులను ధ్వంసం చేశారని, భవనా­లను కూల్చేశారని మండిపడ్డా­రు. పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆయన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మేయర్‌ శిరీష వెళితే ఆమెనూ అడ్డుకు­న్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా రాజీ­నామా చేసి వస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చంద్రబాబు చెబుతున్నారని.. కార్పొరేటర్లకు ఆ నిబంధన వర్తించదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభ­పెట్టి లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. విప్‌ను ఉల్లంఘిస్తే డిస్‌క్వాలిఫై అవుతారని హెచ్చ­రించారు.

నిజాయితీగా పనిచేసే అధి­­కారులను నియమించి ఎన్నికలు సజావు­గా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరా­మని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నాడని, పవన్‌కళ్యాణ్‌ ఇ­లాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం సమంజ­ç­Üం కాదన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లా­డుతూ కూటమి పార్టీలకు బలం లేని చోట ఎందుకు పోటీకి దిగుతు­న్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీకే బలం ఉందని చెప్పారు. టీడీపీ గెలిచే అవకాశమే లేదని తెలిసినా.. సీఎం చంద్ర­బాబు ప్రజాస్వా­మ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిప­డ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లా­డుతూ అడ్డదా­రుల్లో గెలవడం కోసం ఇంత దారుణంగా ప్రయత్నించడం ఎక్కడా చూడ­లేదన్నారు. పోలీస్‌ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)