Breaking News

‘లోకేష్‌, పవన్‌ పిల్లలకు కూడా ఇదే భోజనం తినిపించాలి’

Published on Mon, 02/16/2026 - 15:09

తాడేపల్లి :  ఏపీలోని సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలని చంపుతారని ప్రశ్నించారు. బిల్‌గేట్స్‌తో కూడా హాస్టల్‌ విద్యార్థుల భోజనం తినిపించగలవా చంద్రబాబూ? అని నిలదీశారు. 

ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు.. ఏపీలో సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులకు పెడుతున్న నాసిరకం భోజనంపై ధ్వజమెత్తారు. ‘ మీ పిల్లలాంటి వారు కాదా మా పిల్లలు?, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్ఠం ఏంటి?, హాస్టల్స్‌లో ఉండే వారిని వెలివేసినట్టుగా ప్రభుత్వ పనితీరు ఉంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు బిల్‌గేట్స్‌తో హాస్టల్‌లో భోజనం తినిపించగలరా?, దగ్గర్లో ఉన్న ఏ హాస్టల్‌లో ఐనాసరే ఆకస్మిక తనిఖీకి తీసుకెళ్ళాలి. 

మా ప్రభుత్వ హయాంలో రోజుకొక రీతిలో భోజనం పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంటరానితనంతో వ్యవహరిస్తున్నారు. ఏ.కొండూరులో ఎలుకలు కలిచి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. చంద్రబాబుకు పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపు?, ఇది కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించటమే. 900 మంది విద్యార్థులు ఆస్పత్రులు పాలయిన వైనంపై చర్చ కు సిద్దం. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూడటానికి కొలంబో వెళ్లాడా?, ప్రత్యేక విమానాల ఖర్చులో పది శాతం హాస్టల్స్ కి పెట్టినా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. పయ్యావుల కేశవ్ దళిత వ్యతిరేకి.

నాసిరకం భోజనంతో ఇక్కడ పిల్లలకు చనిపోతుంటే శ్రీలంక వెళ్లి క్రికెట్ చూస్తున్న లోకేష్..

అందుకే బడ్జెట్‌లోనూ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తన పార్టీకి రెండు కోట్లు ఇచ్చారు సరే..‌మరి విద్యార్థుల కష్టాలు కనపడటం లేదా?, అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. అక్కడి మొక్కలకు నీరు పోసే దిక్కు లేదు. జగన్ తెచ్చిన డిజిటల్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, గోరుముద్ద పథకం ఏమయ్యాయి?, విద్యార్థుల మరణాలు, ఆస్పత్రుల పాలవటంపై సీఐడీ విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం దిగిపోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)