Breaking News

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

Published on Fri, 06/06/2025 - 03:27

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు రమేష్‌నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్‌ వాటర్‌ కోసం నన్నూర్‌ నుంచి బైక్‌పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్‌ను ఆపి రమేష్‌­నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్‌ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్‌నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. 

విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్‌నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్‌నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. 

తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.

రాజకీయ నేపథ్యం..
రమేష్‌నాయుడు మొదటి నుంచి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డికి  సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్‌నా­యుడు హత్యతో గ్రామంలో విషాదఛా­యలు అలుము­కున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)