Breaking News

‘పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ పోరాటం ఆగదు’

Published on Sat, 01/04/2025 - 17:26

తణుకు(ప.గో. జిల్లా): తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.  తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కారుమూరి..  పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు.  ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.

‘పంచాయితీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?,  పచ్చటి తణుకును వాయు  కాలుష్యం  నీరు కాలుష్యం కమ్మేస్తుంటే  అధికారులకు పట్టదా ....?, అక్కడ ప్రజలు ముక్కులు  బద్దలయ్యే  వాసనతో  రోదిస్తుంటే 144 సెక్షన్ పెట్టి పోలీస్‌లను పెట్టి వారి  నోళ్లు  నొక్కేస్తారా....?,  గోస్థానం నుండి పుట్టిన గొస్తానీ నదిని గోవు రక్తంతో కలుషితం చేస్తారా?, శాంతియుతంగా ప్రజలు దీక్ష చేస్తుంటే పోలీస్‌లు గూండాల వ్యవహరించి టెంట్‌లు పీకేస్తారా?,  ఎక్కడో యూపీ మనిషికి కొమ్ము కాస్తారా?, ఇక్కడ లక్షల మంది ప్రజల గోడు పట్టదా? అని నిలదీశారు.

తణుకు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. ఇది మంచిది కాదు.. ఇలాంటింటి ప్రకృతి విరుద్ధమైన పరిశ్రమ ఇక్కడ ఉండకూడదు. పశువులను తరలిస్తునప్న వాహనాన్ని ఒక్క పోలీస్‌ కూడా ఆపి చెక్‌ చేయడం లేదు. పాలు ఇవ్వని ఒట్టిపోయిన పశువుగా వెటర్నరీ డాక్టర్‌ సర్టిఫికెట్‌లు లేకుండా పాడి పశువుల్ని వధిస్తుంటే కళ్లప్పగించి చూస్తారా?, నా హయాంలో ఒక్క పశువుని కూడా వధించకుండా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అంత దమ్ము లేదు.. అతనికి డబ్బే ముఖ్యం. ప్రజలు సమస్యలు పట్టవు.. ప్రజలు ఏమైపోయినా పర్లేదు’ అని కారుమూరి ధ్వజమెత్తారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)