Breaking News

‘ఏపీఈఆర్‌సీ సాక్షిగా రుజువైందిగా.. ఇప్పుడేమంటారు చంద్రబాబూ.?’’

Published on Sat, 02/22/2025 - 17:10

నెల్లూరు: సెకీ(SECI) ఒప్పందం  సక్రమమేనని  ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. సెకీతో  గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వార్తలు రాసిందని, ముందు చూపుతో వైఎస్ జగన్(YS Jagan) చేసిన ఒ‍ప్పందంతో రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ లభించిందన్నారు.

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘ఏపీ(AP) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ కు మరక అంటించేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డిస్కమ్ లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదుజగన్ ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల ఆదాయం వస్తే.. చంద్రబాబు వల్ల 87వేల 500 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎల్లో మీడియాకు క్రెడిబులిటీ ఉంటే.. తప్పుడు రాతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్యుత్ రంగాన్ని చంద్రబాబునాయుడు తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు.  చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై బురద చల్లుతున్నారు’అని ధ్వజమెత్తారు.

కాగా, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

Kakani : సెకీ నుంచి ఈ ఏడాదే 4వేల మెగావాట్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు

7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవిన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌)లో ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. విద్యుత్‌ సేకరణపై తాజాగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్‌ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్‌ ‘సెకీ’ విద్యుత్‌ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. 

‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్‌సీ పేర్కొంది.

‘సెకీ’ ఒప్పందం సక్రమమే

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)