Breaking News

సహన కుటుంబానికి అండగా ఉంటాం: అంబటి రాంబాబు

Published on Sat, 11/02/2024 - 13:48

సాక్షి,గుంటూరుజిల్లా: సహన తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారని, ఆయన ప్రకటించిన పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సహన కుటుంబులు సభ్యులకు అందించామని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటిరాంబాబు తెలిపారు. తెనాలిలో టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో  మృతి చెందిన సహన కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి శనివారం(నవంబర్‌ 2) పది లక్షల రూపాయల చెక్కును అందించారు. 

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘సహన ఘటన చాలా దారుణమైనది. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్యం కూడా సకాలంలో అందించలేకపోయారు. సహన హత్య కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెనాలిలో జనసేన పార్టీకు సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇప్పటివరకు సహన ఘటనపై ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలను దారుణంగా మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. సహన హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సహన కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరపున అండగా ఉంటాం’అని తెలిపారు. 

ఇదీ చదవండి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కే రోజా 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)