Breaking News

నాడు తక్షణమే అందిన సాయం.. భరోసా

Published on Fri, 08/23/2024 - 05:51

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ ఘటనలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. నేడు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన దుర్ఘటన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 

నాడు ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు (స్టైరిన్‌ గ్యాస్‌) లీకైన సంఘటన 2020 మే 7వ తేదీ  వేకువజామున 3.40 గంటలకు జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టరు, పోలీస్‌ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

»  6 గంటలకు అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌ తదితర నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
»    వేకువజాము నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. 
»   ఆ రోజుల్లో కోవిడ్‌ కేసులు భారీగా ఉండి.. బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి  నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు  ప్రకటించారు. 
»  ఆ తర్వాత బాధితులను గుర్తించి ప్రకటించిన నష్టపరిహారం అందించారు. అంతేకాక.. మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, చికిత్స పొంది వెంటనే డిశ్చార్జి అయిన వారికి రూ.లక్ష ప్రకటించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే రూ.30 కోట్ల నిధులను విడుదల చేశారు. 
» విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతీ కుటుంబ సభ్యుడికి రూ.10 వేల చొప్పున ఐదు గ్రామాల ప్రజలకు అందజేశారు. 
»  నెలరోజులుభోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతి కల్పించారు. 
» విష వాయువుల ప్రభావంలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రజల్లో భయాలు నెలకొనడంతో వారిలో భరోసా నింపేందుకు వీలుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ విజయసా­యిరెడ్డి, మంత్రులు కన్నబాబు, కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనా­రాయణ, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు రాత్రి సమయాల్లో నిద్రించి ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. 
» ఏకంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడునెలల పాటు హెల్త్‌ క్యాంపులూ నిర్వహించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)