వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Thu, 11/14/2024 - 16:40

తాడేపల్లి : ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నర్రెడ్డి లక్ష్మారెడ్డికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. బాధితునికి అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్‌ను కోరారు. అదే సమయంలో పార్టీ అండగా ఉంటుందని నర్రెడ్డి లక్ష్మారెడ్డికి భరోసా ఇచ్చారు వైఎస్‌ జగన్‌

కాగా, నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గూండాలు.. వైఎ‍స్సార్‌సీపీ నేత లక్ష్మారెడ్డిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో లక్ష్మారెడ్డి  తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డిని అంతమొందించాలనే రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ ఊరి చివరి కాపు కాసి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను పిడుగురాళ్ళలోని పల్నాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

	నర్రెడ్డి లక్ష్మారెడ్డిని ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)