Breaking News

యువతిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్‌

Published on Fri, 02/14/2025 - 14:37

సాక్షి,తాడేపల్లి: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఖండించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ శుక్రవారం(ఫిబ్రవరి 14) ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.

కాగా,అ‍న్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు.  ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.

పీలేరు యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్‌ యాసిడ్‌ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్‌ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్‌ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)