Breaking News

విజయప్రతాప్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

Published on Fri, 01/02/2026 - 20:01

తాడేపల్లి : అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్‌ రెడ్డిపై టీడీపీ గూండాల చేసిన దాడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు.  ప్రస్తుతం విజయప్రతాప్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన తండ్రితో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు వైఎస్‌ జగన్‌. 

ఈ క్రమంలోనే టీడీపీ గూండాల దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారం అండతో వారు చేస్తున్న దాడులను తిప్పికొడదామన్నారు వైఎస్‌ జగన్‌. కూటమి ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 

‘ఈ అనైతిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారు. వైఎస్సార్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి. అందరికీ పార్టీ అండగా ఉంటుంది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వారందరికీ తగిన గుణపాఠం చెబుదాం’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 

కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్‌ బరితెగించింది.  న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో ప్రతాప్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)