Breaking News

హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?

Published on Wed, 03/04/2026 - 04:57

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అ­త్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్‌వాడీ మ­హి­ళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్‌ జగన్‌ తప్పు­బట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ మంగళవారం పోస్టు చేశారు. 

అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్క­ర్లు, హె­ల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ  నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. 

ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్య­యుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. 

ఒక్క అంగన్‌వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్‌వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నా!! 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)