Breaking News

అవ్వాతాతల వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు

Published on Fri, 12/22/2023 - 04:34

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వా తాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ బాధితు­లకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను అందజేయనున్నారు. ఈ పెన్షన్‌ను డిసెంబర్‌ నుంచే రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ జీఓ జారీచేశారు. పెరిగిన పెన్షన్‌ను జనవరి 1న పింఛన్‌దారులకు అందజేయనున్నట్లు ఆ జీఓలో పేర్కొన్నారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వాతాతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నూటికి నూరు శాతం అమలుచేసి చూపించారు. 

నాడు రూ.400 కోట్లు.. నేడు రూ.2వేల కోట్లు..
ఇక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు అర్హులైన దాదాపు 23 లక్షల మంది కొత్త వారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను మంజూరు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల నిమిత్తం నెలనెలా సరాసరిన రూ.400 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెంచిన పెన్షన్‌తో ఏకంగా రూ.2,000 కోట్లు వ్యయం చేస్తోంది.

నిజానికి.. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయకుండా ఎవరైనా మృతిచెందితేనే వారి స్థానంలో కొత్తవారికి మంజూరు చేసేవారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్లను మంజూరు చేస్తోంది. ఇక సామాజిక పెన్షన్ల కోసం నెలకు రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉదంటే అది ఒక్క వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)