Breaking News

పరిశ్రమలకు వరాలు

Published on Sat, 09/02/2023 - 05:13

సాక్షి, అమరావతి: అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని, అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న గొప్ప విజన్‌ ఉండటమే కాకుండా దాన్ని అక్షరాల చేతల్లో చూపించిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు వరాలే అయ్యాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పెట్టుబడులు ఏటా సగటున 54 శాతం వృద్ధి చెందాయి. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు సీఎంలు, వైఎస్‌ తర్వాత సీఎంలు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఆయన మరణించి పదేళ్లు అయినా వైఎస్సార్‌ హయాం పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం. అందుకే ఇప్పటికీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు.

వైఎస్సార్‌ సీఎం కాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ అభివృద్ధినంతా హైదరాబాద్‌కే పరిమితం చేశారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని తన దార్శినికతతో అన్ని ప్రాంతాలకు విస్తరించారు. వైఎస్సార్‌ అభివృద్ధి చేసిన శ్రీ సిటీ, అపాచీ, బ్రాండిక్స్, రాంకీ ఫార్మా వంటి భారీ ప్రత్యేక ఆర్థిక మండళ్లకు తోడు విశాఖ, విజయవాడ, కాకినాడల్లో ఏర్పాటు చేసిన ఐటీ సెజ్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లో శంషాబాద్‌ ఎయిపోర్టు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు , టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, కైజెన్‌ టెక్నాలజీస్‌ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే నెలకొల్పారు. ఇవే కాకుండా వాడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్‌ వంటి అనేక కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి రూ. 11,659 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రమే అమల్లోకి వస్తే.. వైఎస్సార్‌ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 43,117 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.  వైఎస్సార్‌ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి వైఎస్సార్‌ బాటనే అనుసరిస్తున్నారు. అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మూడు రాజధానులతో పాటు పారిశ్రామికంగా అదే బాటను అనుసరిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)