వైఎస్సార్‌ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల

Published on Sat, 09/02/2023 - 10:50

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తమ జ్ఞాపకాలను నేతలు గుర్తుచేసుకున్నారు.

కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఎప్పటికీ మనతోనే ఉంటారు. వైఎస్సార్‌ మనసున్న నాయకుడు. మనసుతో పాలన చేసిన మహానేత వైఎస్సార్‌. వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని సజ్జల అన్నారు.

‘‘వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ పాలనలో ఉండటం మన అదృష్టం. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి వైఎస్సార్‌. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తిరుపతిలో..
సీఎం జగన్‌ సంక్షేమ పాలనలో రాష్ట్రంలో 60 శాతానికిపైగా ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి భూమన నివాళులర్పించారు. వైఎస్సార్‌ మనల్ని విడిచి 14 ఏళ్లు అయినా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారనీ, ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్‌: మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్‌ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి  ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)