ఏళ్లు గడిచినా.. మరువలేని మేళ్లు

Published on Wed, 07/08/2026 - 08:06

ప్రజా సంక్షేమమే శ్వాసగా.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా.. బడుగుల సేవే భగవంతుని సేవగా.. చరిత్రలో నిలిచేలా పరిపాలన సాగించి.. ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేసిన దీనజన బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆ మహనీయుడు దివికేగి ఏళ్లు గడిచినా.. ప్రజలకు చేసిన మేళ్లు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు నిరుపేద బిడ్డలకు సైతం ఉత్తమ భవితను అందిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అత్యున్నతంగా సేవలు అందిస్తూ వైఎస్సార్‌ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. బుధవారం ఈ మేరకు మహానేత జయంతిని పురస్కరించుకుని నాటి సుపరిపాలనను అన్నివర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి.

తిరుపతి సిటీ : ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్‌ ఉండాలనే సదుద్దేశంతో దివంగత మహానేత వైఎస్సార్‌ అద్భుతంగా పరిపాలన సాగించారు. అందులో భాగంగానే విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టూరు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌íÙప్‌లను సకాలంలో అందించి ప్రొత్సహించారు. దీంతో  ప్రతి పేద పిల్లలు సైతం ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాలలో రాణిస్తున్నారు.   

వైఎస్సార్‌ హయాంలోనే రెండు వర్సిటీలు 
తిరుపతి ఎడ్యుకేషనల్‌ హబ్‌గా వెలుగొందుతోందంటే అది వైఎస్సార్‌ చలువే. ఇక్కడ ఆయన రెండు యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు.  ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుకు 2004 సెపె్టంబర్‌ 30వ తేదీన బీజం పడింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తిరుపతి వెటర్నరీ కళాశాల        స్వర్ణోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం 2005 జూలై 15న వర్సిటీగా గుర్తింపు ఇచ్చారు.  క్రమంలోనే తొలివిడతగా రూ.45కోట్లు కేటాయించారు. మలి విడతలో మరో  రూ.100కోట్లు అందించారు. అలాగే వేద విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్‌ వర్సిటీని 2006లో స్థాపించారు. ఇందులో వేద విద్యను అభ్యసించిన వేల మంది విద్యార్థులు పండితులుగా, వేద విద్వాంసులుగా, అర్చకులు, అధ్యాపకులుగా పలు పేరొందిన ఆలయాలలో ఉన్నత స్థానంలో రాణిస్తున్నారు.  

 అంచెలంచెలుగా ఎదిగిన వెటర్నరీ 
వైఎస్సార్‌ నాటిన మొక్క వెటర్నరీ వర్సిటీ నేడు అంచెలంచెలుగా ఎదిగింది. ప్రసుత్తం వర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడిలో వెటర్నరీ కళాశాలు, తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, ముత్తుకూరులో ఫిషరీ కాలేజీ ఉన్నాయి. వీటిలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు యానిమల్‌ హస్బెండరీలో పాలటెక్నిక్‌ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే పేరొందిన పుంగునూరు, ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి పరిశోధనులు సాగుతున్నాయి. పిండమారి్పడి విధానంలో ఈ జాతులను పెంపొందించేందుకు వర్సిటీ కృషి చేస్తోంది.    

మా అరాధ్య దైవం  
రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి గతంలో మాది. హోటళ్లలో భార్యాభర్తలం పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్‌ హాయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్‌ సీటు లభించింది. దీంతో నాలుగేళ్లు పూర్తి కాగానే ఆయన చలువతో పేరొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తున్న ఏడాదిలోపే లండన్‌లో మంచి జీతంలో ఉద్యోగం ఆఫర్‌ వచ్చింది. ప్రస్తుతం మా అమ్మాయి వాళ్ల కుటుంబం లండన్‌లో సెటిల్‌ అయ్యారు. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్‌ ఆరాధ్యదైవం. ఆయనను ఎన్నటికీ మా కుటుంబం మరువదు.  
– సుధారాణి, గృహిణి, తిరుపతి  

మా ఇంటి దేవుడు  
వైఎస్సార్‌ హయాంలో మాలాంటి పేదలు సైతం మెడిసిన్‌ చదువుకునే అవకాశం వచ్చింది. ఆయన తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే నాకు ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళితే కానీ మా కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసే స్థాయికి ఎదిగాను అంటే అది వైఎస్సార్‌ పెట్టిన భిక్షగానే భావిస్తా. ఆయనను మా ఇంటి దేవుడిగానే ఆరాధిస్తున్నాం. మహానేత జయంతిని ఇంటిల్లపాదీ ఘనంగా జరుపకుంటాం.    
– డాక్టర్‌ సుధాకర్, అమెరికాలో పనిచేస్తున్న వైద్యుడు     

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)