Breaking News

పులివెందుల ‘కంటికి రెప్పలా’..

Published on Wed, 02/26/2025 - 04:56

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి నేత్ర వైద్యశాల రూపురేఖలు మారాయి. ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికే నేత్ర వైద్య సేవలందిస్తున్న ఈ వైద్య­శాలకు వైఎస్సార్‌ ఫౌండేషన్‌ స్థలం సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైఎస్‌ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. 

గతంలో వైఎస్‌ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలో ఏ విధంగా కంటి ఆపరేషన్లు చేసేవారో.. నూతనంగా ప్రారంభించే ఎల్వీ ప్రసాద్, వైఎస్‌ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలోనూ అదేవిధంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయనున్నారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆస్పత్రిలో అందుబాటులో ఉంచారు. 

భవిష్యత్‌లో ఐ కేర్‌ సెంటర్లు 
హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తరహాలో పులివెందులలో కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ప్రసాద్, వైఎస్‌ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థలో 25 వార్డులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌తో కంటి పరీ­క్షలు, డయోగ్నస్టిక్‌ సేవలు అందించనున్నారు. 

పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలతోపాటు ఆపరేషన్లు చేస్తారు. మొదటివిడతగా పులివెందులలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యులచే వైఎస్‌ రాజారెడ్డి నేత్రాలయాన్ని ఏర్పాటు చేయగా.. రానున్న రోజుల్లో 50 వేల జనాభా గల ప్రతి గ్రామంలో ఐ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

నేడు ప్రజలకు అంకితం
వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్, వైఎస్‌ రాజారెడ్డి నేత్రాలయాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బుధవారం పులివెందుల ప్రజలకు అంకితం చేయనున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)