నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
Published on Sun, 07/07/2024 - 21:35
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) ఇడుపులపాయలో పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి రానున్నారు.
కాగా, వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Tags : 1